Oka Vijetha Atma Katha



నేను పుట్టింది మధ్య తరగతి తమిళ కుటుంబంలో . పూర్వపు మద్రాసు రాష్టంలోని రామేశ్వరం ద్వీప పట్టణం నా పుట్టిన వూరు . నా తండ్రి జైనులాబ్దీన్ విద్యాదికుడూ  కాడు, సంపన్నుడూ కాడు . వీటిని మించిన గొప్ప అంతర్గత విజ్ఞతా, ఆత్మిక ఔదార్యమూ ఉండేవి ఆయనకి. నా తల్లి అశియమ్మ ఆయనకు ఆదర్శ సహచారిని. ఆమె రోజూ ఎంతమందికి వండి వార్చేదో నాకిప్పుడు గుర్తులేదు గానీ, మా కుటుంబ సబ్యులందరికన్నా ఎక్కువమందే బయటి వాళ్ళు రోజూ మా ఇంట్లో మాతో కలిసి భోంచేసేవారని చెప్పగలను. 
          నా తల్లితండ్రులు ఆదర్శ దంపతులుగా గుర్తించబడేవారు . నా తల్లి వంశం మరింత విశిష్టమైంది . ఆమె పూర్వికుల్లో ఒకాయన్ని బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహదూర్ బిరుదుతో సత్కరించింది. ఆ అందమైన తల్లితండ్రులకు పుట్టిన పిల్లల్లో నేనోకన్ని. చిన్నవాణ్ణి. అంతగా విశేషమేమీ లేని చూపులు నావి .
         పందొమ్మిదో శతాబ్దిలో నిర్మించిన మా పూర్వీకుల గృహంలో నివసిన్చేవాళ్ళం మేం . ఇటుకతోనూ సున్నంతోనూ కట్టిన విశాలమైన ఆ పక్క ఇల్లు రామేశ్వరం మశీదు వీధిలో వుండేది . సజ్జనుదిన నా తండ్రి అనవసరమైన భోగభాగ్యాలకు దూరంగా ఉండేవాడు . అలాగని మా కనీస అవసారలకుగానీ , అన్నవస్త్రలకుగానీ వైద్య సదుపాయానికిగానీ మాకెప్పుడూ లోటు చెయ్యలేదు . నిజానికి చెప్పాలంటే భౌతికంగాగానీ మానసికంగాకానీ నా బాల్యం  ఎంతో భద్రప్రదమైందనే అనాలి .
          నేనెప్పుడు మా అమ్మతో పాటే కలిసి భోంచేసేవాణ్ని . వంటగదిలో నేలమీద కూచునేవాళ్ళం. ఆమె నా ముందొక అరటాకు పరిచి దాని మీద అన్నం, ఘుమగుమలాడే సాంబార్ వడ్డించేది . వాటికి తోడు ఇంట్లోతయారయ్యే ఘాటైన ఊరగాయలూ , తాజా కొబ్బరి పచ్చడీను.
         యాత్రికులకి రామేశ్వరాన్ని పవిత్ర స్థలంగా చేసిన శివాలయానికి మా ఇంటినించి పది నిమిషాల నడక . మేముండేది ప్రదానంగా  ముస్లిం ప్రాంతమే అయినప్పటికీ అక్కడ తమ ముస్లిం పొరుగుతో ప్రశాంత సహజీవనం చేసే కొన్ని హిందూ కుటుంబాలు కూడా ఉండేవి. మా ప్రాంతంలో చాలా పురాతనమైన మసీదు వుండేది . మా తండ్రి నన్ను కూడా సాయంకాల ప్రార్ధనలకు తీసుకువెళ్ళేవాడు . అక్కడ గానం చెయ్యబడే ఆ అరబిక్ మంత్రాల అర్థమేమిటో నాకేమాత్రం తెలియక పోయినప్పటికీ అవి భగవంతుడిని చేరతాయనడంలో నాకేమాత్రం సందేహం వుండేది కాడు. 

No comments:

Post a Comment