అనగనగా అటుకులపాలెం అనే ఊరు వుండేది. ఆ ఊరిలో రామసుబ్బయ్య అనే రైతుకి ఒక్కగానొక్క కొడుకు పేరు పీనాకి ముద్దుగా పీన అని పిలిచేవారు అందరు. రామసుబ్బయ్య తన కొడుకుని బాగా చదివిన్చాలనుకున్నాడు . కాని చదువు అంతగా అబ్బలేదు . ఐదవ తరగతి మధ్యలోనే చదువు మానేసాడు. ఇక అప్పటినుండి తండ్రి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు.
ఇలాగే మన పీన భాల్యం గడిచిపోయింది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇలా జీవిత ప్రయాణంలో మన పీనాకి పెళ్లి వయస్సు రానే వచ్చింది. మన రామసుబ్బయ్య గారు తనకి కాబోయే కోడలి కోసం పల్లె పట్నం అనే తేడా లేకుండా వెతకటం మొదలుపెట్టాడు . తనకి పరిచయమున్న వాళ్ళందరికీ అమ్మాయిల గురించి ఆరాతీయటం మొదలెట్టాడు. అందరు మన పీన గురించి తెలిసి అమ్మాయిల జాడ చెప్పటానికి ముందుకు రావటం లేదు. ఇంతకి ఎందుకంటారా , ఏమి లేదండి . ఈ కాలంలో అబ్బాయి , అమ్మాయి అనే తేడా లేకుండా అందరు డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ,బి.టెక్, ఎం.టెక్ అంటూ బాగా చదువుతున్నారు. మరి ఇలాంటి సమయంలో ఎలిమెంటరీ కూడా పూర్తిచెయ్యని మన పీనాకికి పిల్లని ఇవ్వటానికి ఎవరు ముందుకు రావటం లేదు . అడపాదడపా కొన్ని సంబందాలు వచ్చినా ఏదో ఒక కారణం చేత కుదరలేదు . ఇలా వయసు మీద పడే కొద్ది రామసుబ్బయ్యకి తన కొడుకుపై కంగారు పెరిగింది. ఒక రోజు రామసుబ్బయ్య చిన్ననాటి మిత్రుడు కలిసి ఒక సలహా ఇచ్చాడు. ఇంతకి ఏమి చెప్పాడు అనుకుంటున్నారా ! "ఇదిగో చూడు సుబ్బయ్య ఇలా మీ వాడికి ఎన్ని సంబందాలు చుసిన లాబం లేదు. నేను చెప్పినట్టుగా చెయ్ అంటూ మొదలెట్టాడు . మీ అబ్బాయి కూడా చదువుకున్నాడు అని సంబందాలు వెతకటం మొదలుపెట్టు అని చెప్పాడు " . ఇంత కన్నా వేరే మార్గం లేదు అని చెప్పాడు. కాని అది బాగానే వుంది కాని అలా మోసం చేసి పెళ్లి చేయటం మంచిది కాదు అన్నాడు . అప్పుడు రామసుబ్బయ్య మిత్రుడు మాట్లాడుతూ ఇందులో పెద్ద తప్పేముంది వంద అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యమని మన పెద్దవాల్లె చెప్పారు అని అన్నాడు. ఏది ఏమైనా ఈ సలహా మన రామసుబ్బయ్యకి నచ్చింది.
అప్పుడు రామసుబ్బయ్యకి అది తప్పులా తోచలేదు . ఎందుకంటే ఏదోలా తన కొడుక్కి పెళ్లి చేయటమే ముక్యం అనుకున్నాడు. అప్పటినుండి రోజుకి ఏదో ఒక సంబంధం చుట్టానికి వెళ్ళేవారు. ఇలా ఒక నెల గడవక ముందే ఒక మంచి సంబంధం కుదిరింది. మంచి అందమైన అమ్మాయి , ఒక్కతే కూతురు బాగా కట్నం ఇచి పెళ్లి చేసారు.
ఇప్పుడు మొదలైంది మన పీనాకి సమస్య ఎందుకంటే డిగ్రీ చదివాడని చెప్పి పెళ్లి చేసారు. పెళ్ళైన కొత్తలో అత్తారింటికి వెళ్ళాడు బాగానే మొదటి రెండురోజులు గడచిపోయాయి . మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఉత్తరం వచ్చింది . అది తీసుకున్న పీనాకి మామగారు పీన చేతికి లెటర్ ఇచ్చి చదివిపెట్టమని అడిగాడు . అప్పుడు పీనాకి ఎం చేయాలో తోచక అటు ఇటు చూసాడు . అది తెలుగులోనే వుంది. మన వాడికి ఏదో నాలుగు ముక్కలు వచ్చు కనుక మేనేజ్ చేద్దామని ట్రై చేసాడు.
ఆ లెటర్ ముందుగా ఇలా మొదలైంది "మహా రాజశ్రీ " మన పీనకికి మా కి , యా కి , తేడా తెలియక ఒక్కసారిగా "అంతమా ఎంతైతివే " అని అన్నాడు . అది విన్న వాళ్ళ అత్తామామలు ఏడవటం మొదలెట్టారు .
(ఎందుకంటే వాళ్లకి అంతమ్మ అనే బందువు వుండేది , వాళ్ళ అల్లుడు ఒక్కసారిగా అల అనే సరికి ఆమె కి ఏదో జరిగిందని ఉహించి ఏడవటం మొదలెట్టారు.) ఆ ఏడుపు విన్న వాళ్ళ ఇరుగు పొరుగు గుమి గూడీ ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగారు, అప్పుడు పీనాకి వాళ్ళ మామ ఆ ఉతరాన్ని పక్కవారికి ఇచ్హాడు. అది చదివిన వారు ఇందులో అంతగా ఎదవటానికి ఏమి లేదు అని చదివి వినిపించారు. అప్పుడు పీనాకి అత్తామామలకి అర్థం అయింది అసలు తమ అల్లుడికి చదువు రాదని తెలిసిపోయింది . ఇక చేసేది ఏమి లేక ఇదంతా తమ తల రాత అని భావించి సరిపెట్టుకున్నారు.
ఏదో విధంగా మన వాడి గండం గట్టెక్కిపోయింది. ఇక మన వాడి జీవితం హాయిగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోయింది . ఐన మన మాట ఒక్క అబద్దం ఆడితేనే ఇలా వుంటే మరి వంద అబద్దాలు ఆడితే.....................వామ్మో .............................

hahahahaha 100 abaddhalu adithe anthe ika
ReplyDelete